Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

  • మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
  • సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు
  • కఠిన చర్యలు  తీసుకోవాలని మండలి చైర్మన్ కు వినతి

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు నేడు శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, ఎమ్మెస్ ప్రభాకర్ కలిశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. శాసనమండలిని ఇరానీ కేఫ్ గా అభివర్ణించారని, మండలి సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు మండలి చైర్మన్ కు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారు

  • దావోస్, లండన్‌లలో పర్యటించనున్న ముఖ్యమంత్రి
  • ముఖ్యమంత్రి హోదాలో తొలి విదేశీ పర్యటన
  • రేవంత్ రెడ్డితో పాటు వెళ్లనున్న మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు
CM Revanth Reddy to visit Davos this month

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆయన విదేశాలలో పర్యటించనున్నారు. దావోస్, లండన్‌లలో ఆయన పర్యటిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు. దావోస్ సదస్సులో భాగంగా ప్రముఖ ప్రపంచ కంపెనీలకు చెందిన సీఈవోలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

Related posts

అక్బరుద్దీన్ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ?

Ram Narayana

ఖమ్మం ఎంపీ సీటు ఇప్పించండి …సీఎం రేవంత్ ని కలిసి కోరిన విహెచ్

Ram Narayana

పదవీ కాలం ముగిసే వరకు మాత్రమే బీఆర్ఎస్‌లో ఉంటాను: ఎమ్మెల్యే రేఖానాయక్

Ram Narayana

Leave a Comment