Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

విజయవాడ నుంచి పోటీచేస్తే గెలుపు నాదే…బీజేపీ నేత సుజనాచౌదరి …

విజయవాడ నుంచి పోటీ చేస్తే నా గెలుపు ఖాయం: సుజనా చౌదరి

  • అధిష్ఠానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానన్న సుజనా చౌదరి
  • పొత్తులపై హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
  • అమరావతికి బీజేపీ అనుకూలంగా ఉందన్న సుజనా చౌదరి

బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి తనను ఎన్నికల బరిలోకి దింపితే తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పొత్తులపై తమ అధిష్ఠానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని అన్నారు. అమరావతికి బీజేపీ హైకమాండ్ అనుకూలంగా ఉందని చెప్పారు. 

ఏపీలో ఈసారి ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని సుజనా చౌదరి అన్నారు. బీజేపీ చేసిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాలంటీర్లను ఎన్నికల కమిషన్ దూరంగా ఉంచడం మంచి పరిణామమని అన్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Related posts

ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Ram Narayana

వైసీపీకి రాజీనామా చేసిన గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా…

Ram Narayana

పూతలపట్టు సభలో సీఎం జగన్ కు పాదాభివందనం చేసిన మంత్రి రోజా

Ram Narayana

Leave a Comment