Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బిల్లులు ఆపిన వారే పోరాడుతామని చెప్పడం విడ్డూరంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్న ఉత్తమ్  
  • విద్యార్థి దశ నుంచే వారు కాంగ్రెస్ పక్షాన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారన్న మంత్రి
  • ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతాయని ఆశాభావం

సర్పంచ్‌ల బిల్లులు ఆపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని… కానీ ఇప్పుడు వారి తరఫున పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్‌లు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్నారు. ఇందుకు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లు నిదర్శనమన్నారు. వీరు సుదీర్ఘకాలం పార్టీలో పని చేస్తున్నారన్నారు. విద్యార్థి దశ నుంచే వారు కాంగ్రెస్ పక్షాన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు వారి కష్టానికి, త్యాగానికి సరైన ఫలితం దక్కిందన్నారు. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు… ముఖ్యమంత్రి కాలేడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు

Ram Narayana

కొంతమంది ఇప్పుడొచ్చి కొడంగల్ కు రా, గాంధీ భవన్ కు రా అని సవాళ్లు విసురుతున్నారు: సీఎం కేసీఆర్

Ram Narayana

మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు!

Ram Narayana

Leave a Comment