Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్….! 

: షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్….! 

  • షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం
  • హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో వేడుక
  • మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న సీఎం జగన్

ADVERTISEMENT

CM Jagan attends Sharmila son engagement

ఏపీ సీఎం జగన్ తన సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. 

ఇక, నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి,   అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు.

Related posts

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించిన సుప్రీంకోర్టు!

Drukpadam

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు: 5,326 మంది ఓటర్లు …  శశాంక్‌ గోయల్‌

Drukpadam

అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు ఈసీ అనుమతి కోరిన లోకేశ్!

Drukpadam

Leave a Comment