Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

వరుణ్ గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన అధిర్ రంజన్ చౌదరి ..!

  • ఫిలిబిత్ నుంచి వరుణ్ గాంధీకి టిక్కెట్ నిరాకరించిన బీజేపీ
  • ఆయన మూలాలు గాంధీ కుటుంబంతో ముడిపడి ఉండటం వల్లే బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత
  • కాంగ్రెస్‌లోకి వస్తే ఆనందిస్తామన్న అధిర్ రంజన్ చౌదరి

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. బీజేపీ ఆయనకు ఫిలిబిత్ నుంచి టిక్కెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఉత్తర ప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాదకు టిక్కెట్ కేటాయించింది. వరుణ్ గాంధీ కొన్నాళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయనకు బీజేపీ టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం మాట్లాడుతూ… వరుణ్ గాంధీ వస్తే తాము స్వాగతిస్తామన్నారు. ఆయన మూలాలు గాంధీ కుటుంబంతో ముడిపడి ఉండటం వల్లే బీజేపీ టిక్కెట్ నిరాకరించిందని ఆరోపించారు.

‘వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావాలి. అప్పుడు మేం ఎంతో ఆనందిస్తాం. అతను చదువుకున్న వ్యక్తి. అలాగే క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది. అందుకే అతను రావాలని (కాంగ్రెస్) నేను భావిస్తున్నాను’ అని అధిర్ రంజన్ అన్నారు. ఫిలిబిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన రెండుసార్లు బీజేపీ నుంచే గెలిచారు. 1989లో మేనకా గాంధీ జనతాదళ్ నుంచి గెలిచారు. 1991లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో, 2014లో మేనకా గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.

Related posts

నేడు వాయనాడ్‌లో ప్రియాంక నామినేషన్!

Ram Narayana

అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి: సీపీఐ నేత డి.రాజా

Ram Narayana

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ… సీడబ్ల్యూసీ తీర్మానం…

Ram Narayana

Leave a Comment