తెలంగాణ రాజకీయ వార్తలు ..

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి….జంపింగ్ జిలానీలు కూడా ఎక్కువవుతున్నారు ….ఉదయం వరకు ఒక పార్టీలో ఉన్నవారు సాయంత్రానికి మరో పార్టీలోకి మారుతున్నారు ….ఊసరవెల్లి సైతం సిగ్గుతో తలవంచుకునే రీతిలో పార్టీల కండువాలు మార్చుతున్నారు ….ఇటీవలే వరంగల్ బీఆర్ యస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మాజీమంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్యను కేసీఆర్ ప్రకటించారు …ఈ సందర్భంగా కడియం శ్రీహరి నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానని కేసీఆర్ ను కలిసిన సందర్భంగా అన్నారు …ప్రతిగా కేసీఆర్ నీ బిడ్డ కాదు ఇక నా బిడ్డ అనుకో అన్నారు ….అక్కడ నుంచి వెళ్లి వరంగల్ లో ప్రచారం కూడా మొదలు పెట్టారు ..ఏమైందో ఏమో కానీ కొద్దిరోజుల్లోనే ఆమె బీఆర్ యస్ లో రౌడీలు , కబ్జాకోరులు , సంఘవ్యతిరేక శక్తులు ఉన్నారని అందువల్ల తాను మీ పార్టీలో కొనసాగలేనని కేసీఆర్ కు లెటరు రాస్తూ తనకు ఇచ్చిన వరంగల్ ఎంపీ సీటు ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు … వెంటనే కాంగ్రెస్ నేతలను కలిసి కండువా కప్పుకున్నారు …సోమవారం ఆమె ను కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ….

Related posts

బంధుత్వం కన్నా పార్టీనే ముఖ్యమన్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Ram Narayana

జై జై తుమ్మల , జైయహో తుమ్మలతో మార్మోగిన ఖమ్మం సరిహద్దు ప్రాంతం … టోల్ ప్లాజా వద్ద జనసంద్రం … . ఖమ్మం సరిహద్దుల్లో ఘనస్వాగతం…!

Ram Narayana

ఈనెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల.. బీ ఫారాల పంపిణీ

Ram Narayana