Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ…

  • ఉదయం 7.30 గంటల సమయంలో పోలింగ్ బూత్‌కు ప్రధాని
  • అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్లో ఓటు వినియోగం
  • మోదీని చూసేందుకు పోలింగ్ బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) కొనసాగుతున్న మూడో దశ పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ నగరంలోని రాణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఉదయం 7:30 గంటల సమయంలో ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్ వద్దకు వెళ్లారు. కాగా ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. రోడ్డు పక్కన నిలబడి మోదీ అనుకూల నినాదాలు చేశారు. ఒక అభిమాని మోదీ చిత్రపటాన్ని తీసుకొని రాగా దానిపై ప్రధాని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. 

బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. దేశంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఓటు వేయాలని సూచించారు. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలివుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

మరోవైపు ఎన్నికలకు సంబంధించి నిర్విరామంగా కవరేజీ అందిస్తున్న మీడియా ప్రతినిధులను మోదీ మెచ్చుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆయన సూచించారు. నీరు బాగా తాగాలని అన్నారు.

ఓట‌ర్ల‌తో ప్ర‌ధాని మ‌మేకం.. చిన్నారిని ముద్దాడిన మోదీ!

PM Modi Play with Child after Casting his Vote in Ahmedabad

లోక్‌స‌భ‌ మూడో దశ పోలింగ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ప్ర‌ధాని ఓటు వేశారు. అనంత‌రం ఓట‌ర్ల‌ను క‌లుస్తూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. వారితో క‌ర‌చాల‌నం చేశారు.  

ఈ క్ర‌మంలో ముందు కంటిచూపులేని ఓ యువ‌తి ద‌గ్గ‌రికి వెళ్లి మాట్లాడారు. ఆమె ప్ర‌ధానిని ద‌గ్గ‌ర‌కు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఎస్‌పీజీ గార్డ్ అడ్టుకున్నారు. దీంతో ప్ర‌ధాని అత‌డిని వారించారు. అనంత‌రం మోదీ ఓ చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ఆడించి, ముద్దాడారు.  

ఆ త‌ర్వాత ఓ వృద్ధురాలు మోదీకి ఆప్యాయంగా రాఖీ క‌ట్టారు. ఇలా ఓటు వేసిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ పోలింగ్ బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలతో మ‌మేకమ‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

మ‌రోవైపు ప్ర‌ధాని మోదీ ఓటు హ‌క్కు వినియోగించుకున్న త‌ర్వాత దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, అందుకే అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు.

Related posts

సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్…!

Ram Narayana

హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం!

Ram Narayana

రాజీనామా చేసే సమస్యే లేదన్న మణిపూర్ సీఎం

Ram Narayana

Leave a Comment