Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుస్సుమన్న కాంగ్రెస్ గ్యారంటీలు …మాజీమంత్రి హరీష్ రావు

తుస్సుమన్న కాంగ్రెస్ గ్యారంటీలు …మాజీమంత్రి హరీష్ రావు ..
వరంగల్ , నల్గొండ , ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటినుంచి గెలుపు మనదే ..
ఉపాధ్యాయులమీద లాఠీచార్జి చేసిన పార్టీ కాంగ్రెస్
నిరుద్యోగ భృతి విస్మరించిన పార్టీ కాంగ్రెస్
మహిళలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్

కాంగ్రెస్ ను నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని అందువల్ల విజ్ఞులైన పట్టభద్రులు శానమండలి ఎన్నికల్లో బీఆర్ యస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ యస్ సీనియర్ నేత , మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు …రాకేష్ రెడ్డికి మద్దతుగా భూపాలపల్లిలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి గ్రాడ్యుయేట్‌ ఎన్నిక జరిగినప్పుడల్లా వరంగల్ , నల్గొండ , ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో మనమే గెలిచామని గుర్తు చేశారు .. బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రాకేష్ రెడ్డి లాంటి సమర్దుడిని గెలిపించుకోవాలని అన్నారు . పట్టభద్రులు అంటే బాగా చదువుకున్నవారని ఆలోచనాపరులని ఎవరు ఏమిటో తెలుసుకొని ఓటు వేయాలన్నారు …

ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ తుస్సుమన్నాయని ధ్వజమెత్తారు .. కాంగ్రెస్ ప్రచారంలో 6 గ్యారంటీల్లో ఐదు అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు. ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు. సన్న బియ్యానికే మద్దతు ధర ఇస్తారట.. మన తెలంగాణాలో దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తామని… పండించిన రైతుల పరిస్థితి ఎంటని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచిందని, మహిళా గ్రాడ్యుయేట్‌లు కూడా బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నారన్నారు. మహిళా పథకం కింద వారికి నెలకు రూ. 2,500 ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. నిన్న వరంగల్ ఎంజీఎంలో కరెంట్ పోయిందన్నారు. విద్యుత్ ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

Related posts

టికెట్స్ కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి …కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Ram Narayana

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మన మద్దతు: ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ లేఖ

Ram Narayana

బీఆర్ యస్ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఫైనల్…

Ram Narayana

Leave a Comment