Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు…

  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం
  • అనారోగ్య కారణాలతో టూర్ రద్దు చేసుకున్న యూపీఏ చైర్ పర్సన్
  • ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరు కావడంలేదు. అనారోగ్య కారణాలతో తెలంగాణ టూర్ ను సోనియా రద్దు చేసుకున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించిన సోనియా గాంధీ.. వేడుకలకు హాజరవుతానని మాటిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Related posts

మోదీ కేబినెట్లో 20 మంది సీనియర్లకు ఉద్వాసన.. ఎందుకంటే!?

Drukpadam

ఢిల్లీ విమానాశ్రయంలో 6 కోట్ల విలువైన వజ్రాల నెక్లెస్ స్వాధీనం!

Ram Narayana

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి జెడ్ కేటగిరీ భద్రత!

Ram Narayana

Leave a Comment