జాతీయ వార్తలు

ఢిల్లీ విమానాశ్రయంలో 6 కోట్ల విలువైన వజ్రాల నెక్లెస్ స్వాధీనం!

  • బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి ఖరీదైన నెక్లెస్ అక్రమ రవాణా
  • గుజరాత్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్ 
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు

ఢిల్లీ విమానాశ్రయంలో వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.6 కోట్ల విలువైన నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ఆదివారం వెల్లడించారు.

ఈ నెల 12న బ్యాంకాక్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతను అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వజ్రాలు పొదిగిన 40 గ్రాముల ఈ నెక్లెస్ విలువ సుమారు రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Related posts

పిల్లలను తాకట్టు పెట్టి టమాటాలతో పరార్.. ఒడిశాలో నయా మోసం

Ram Narayana

మన్మోహన్ సింగ్ కన్నుమూసింది ఈ ప్రమాదకర అనారోగ్య సమస్యతోనే!

Ram Narayana

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి మెసేజ్ పంపిన సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి!

Ram Narayana