Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు… బాంబే హైకోర్టు సంచలన తీర్పు…

ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు… బాంబే హైకోర్టు సంచలన తీర్పు
-ఎస్సీ కుల ​ధ్రువీకరణ పత్రం రద్దుపై సుప్రీంకోర్టుకు వెళతా: నవనీత్ కౌర్
-తీర్పును గౌరవిస్తానన్న నవనీత్ కౌర్
-సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకముందని ధీమా
-స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచిన సినీ నటి
-మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి ఎన్నిక
-ఎస్సీనంటూ తప్పుడు పత్రాలు ఇచ్చారంటున్న శివసేన
-ప్రమాదంలో పడిన నవనీత్ కౌర్ ఎంపీ పదవి

సినీ నటి,మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ (35)కు ఊహించని పరిణామం ఎదురైంది. 2019 ఎన్నికల్లో ఆమె ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గమైన అమరావతి నుంచి గెలుపొందారు .ఆమె ఎన్నికల్లో ఎస్సీ పత్రాలు సమర్పించి ఎన్నికల్లో పోటీచేశారు. ఆమె ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అలాగే, రూ.2 లక్షల జరిమానా కూడా వడ్డించింది. నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే, నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆమె ఎస్సీ కాదని తేల్చింది. కుల ధ్రువీకరణ రద్దు నేపథ్యంలో నవనీత్ కౌర్ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. కాగా, గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించడం తెలిసిందే. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారని ఆమె గతంలోనే వెల్లడించారు. అంతేకాదు, శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లేఖలు వస్తున్నాయని, హెచ్చరికలు చేస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు.

సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ, ఆమె గతంలో దాఖలు చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు (నాగ్ పూర్ బెంచ్) రద్దు చేయడంతో తీర్పుపై నవనీత్ కౌర్ స్పందించారు. ఓ భారత పౌరురాలిగా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కమిటీని తప్పుదారి పట్టించేందుకు నవనీత్ కౌర్ కల్పిత, మోసపూరిత పత్రాలను సమర్పించారని నాగ్ పూర్ బెంచ్ అభిప్రాయపడింది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను ప్రేమ వివాహం చేసుకున్న నవనీత్ కౌర్ అమరావతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆమె ఎస్సీ కాదంటూ శివసేన నేతలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.

Related posts

ఖమ్మంలో ఎంపీలు నామ,వద్దిరాజు,ఎమ్మెల్సీ తాతా మధుల పర్యటన….

Drukpadam

Drukpadam

కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. అనూహ్యంగా దిశ మార్చుకున్న ‘అసని’!

Drukpadam

Leave a Comment