Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో సినీ నటి హేమ అరెస్ట్…!

  • గత నెల 20న బెంగళూరులో రేవ్ పార్టీ
  • ఐదుగురితో కలిసి రేవ్ పార్టీ నిర్వహించిన హేమ
  • విచారణకు హాజరు కావాలని మూడుసార్లు సీసీబీ నోటీసులు
  • మూడోసారి నోటీసుతో ఈరోజు విచారణకు హాజరైన హేమ
  • విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు

సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని ఆమెకు సీసీబీ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరుకాలేదు. మూడోసారి నోటీసుతో విచారణకు హాజరయ్యారు.

ఉదయం నుంచి ఆమెను సీసీబీ పోలీసులు విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఐదుగురితో కలిసి హేమ దీనిని నిర్వహించారని ప్రచారం సాగుతోంది.

Related posts

గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై కత్తులతో దాడి!

Drukpadam

ఖమ్మం లో లేడీ కిలాడి … లాడ్జ్ లో మకాం చివరికి కటకటాలు

Drukpadam

బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య కేసు.. ప్రధాన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు…

Ram Narayana

Leave a Comment