Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 594 ఓట్ల లీడ్ లో ఉన్న మల్లన్న…

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్…ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టిన కౌంటింగ్ సిబ్బంది
రిటర్నింగ్ అధికారి ,జిల్లా కలెక్టర్ పర్వేక్షణలో కొనసాగుతున్న కౌంటింగ్

ఖమ్మం ,నల్లగొండ , వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్ నల్గొండలో కొనసాగుతుంది …కడపటి వార్తలు అందేసరికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు…రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డి కొనసాగుతున్నారు … మొదటి ప్రాధాన్యత ఓట్లలో 51% పైగా ఓట్లు తెచ్చుకున్న వారు విజేతగా నిలుస్తారు ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 51 శాతం రాకపోతే ఆశాతం వచ్చేవరకు ఎలిమినేషన్ పద్దతిలో తక్కువ ఓట్లు వచ్చినవారిని తొలగిస్తూ లెక్కింపు కొనసాగిస్తారు …51 శాతం ఏ అభ్యర్థికి వస్తే వారు గెలుస్తారు ..

నాలుగు లక్షల అరవై రెండువేల ఓట్లు ఉండగా మూడు లక్షల పైగా ఓట్లు పోలయ్యాయి ..మొత్తం ఓట్లను బాక్సులను నల్గొండ కు తరలించి లెక్కిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ఈ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.. మొదటగా మొదట ప్రాధాన్యత క్రమంలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనిది తేలిన తర్వాత 51 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు…

మల్లన్నకు 2167 —రాకేష్ రెడ్డి 1573

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అధిక్యం
ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో తీన్మార్ మల్లన్న లీడ్
సెకండ్ ప్లేస్ లో బీఆర్ యస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
కాంగ్రెస్:2167
బీఆర్ యస్ : 1573
ఇప్పటివరకు 594 లీడ్ లో ఉన్న మల్లన్న

Related posts

బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల మధ్య పొత్తు పై ముందుకు పడని అడుగులు …!

Ram Narayana

రైతుబంధు సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రాజయ్య

Ram Narayana

అనారోగ్యం నుంచి కోలుకోని కేసీఆర్.. నేటి కేబినెట్ సమావేశం వాయిదా

Ram Narayana

Leave a Comment