Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

చిరంజీవి ఇంటికి ‘తమ్ముడు’… ‘అన్నయ్య’కు పాదాభివందనం ..

  • ఎన్డీయే సమావేశంలో పాల్గొని హైదరాబాద్ వచ్చిన పవన్ కల్యాణ్
  • చిరంజీవి నివాసానికి వెళ్లిన జనసేనాని
  • పూలవర్షంతో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
  • జనసేనానిని ఆలింగనం చేసుకున్న రామ్ చరణ్, సురేఖ, వరుణ్ తేజ్
  • తమ్ముడిని ఆప్యాయంగా కౌగిలించుకున్న చిరు
  • తల్లి, వదినలకు కూడా పాదాభివందనం చేసిన పవన్ 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు.

చిరంజీవికి పాదాభివందనం చేసిన జనసేనాని

పవన్ కల్యాణ్‌ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కల్యాణ్ దంపతులకు తల్లి, వదిన హారతితో స్వాగతం పలికారు. జనసేనాని ఇంట్లోకి వెళ్లీ వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికు పాదాభివందనం చేశారు. తమ్ముడిని అప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒకింత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు. ‘డియర్ కల్యాణ్ బాబు’ అంటూ కేక్‌ను కట్ చేశారు. పవన్ కల్యాణ్ ఆ తర్వాత తన తల్లి, వదిన పాదాలకు కూడా నమస్కరించారు.
.

Related posts

కంటి ఆపరేషన్ పూర్తయ్యాక చిరునవ్వులు చిందిస్తూ చంద్రబాబు…!

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందన

Ram Narayana

ఈ నెల 24న ఏపీ, తెలంగాణ అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం..

Ram Narayana

Leave a Comment