Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంప్రమాదాలు ...

మలావి విమానం గల్లంతు విషాదాంతం… ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం…

  • అదృశ్యమైన విమానం పర్వత ప్రాంతాల్లో కూలినట్లుగా గుర్తింపు
  • పర్వత ప్రాంతాల్లో విమాన శకలాలను గుర్తించినట్లు ప్రకటించిన మలావి అధ్యక్షుడు
  • ఉపాధ్యక్షుడి మరణం నేపథ్యంలో నేడు సంతాపదినంగా ప్రకటన

ఆఫ్రికా దేశం మలావిలో అదృశ్యమైన విమానం… పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందారు. ఈ మేరకు మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు. పర్వత ప్రాంతాల్లో గల్లంతైన విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపారు. అందులో ఎవరూ ప్రాణాలతో లేరన్నారు. ఈ విమానం చికంగావా పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లు మలావీ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఉపాధ్యక్షుడి మరణం నేపథ్యంలో ఈరోజును సంతాపదినంగా ప్రకటించారు.

సోమవారం ఉదయం రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఘటనలో దేశ ఉపాధ్యక్షుడు షిలిమాతో పాటు మరో 9 మంది దుర్మరణం పాలుకావడం బాధాకరమని మలావి అధ్యక్ష కార్యాలయం, కేబినెట్ కార్యాలయం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.

Related posts

నిజ్జర్ హత్య వెనుక చైనా భారీ కుట్ర!

Ram Narayana

ఈ దేశాల్లో నేరాలు అతి తక్కువ..!

Ram Narayana

ఫ్రాన్స్‌ను వణికిస్తున్న ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్

Ram Narayana

Leave a Comment