Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

చంద్రబాబు ఇంటికి అమిత్ షా, జేపీ నడ్డా… మంత్రివర్గ కూర్పుపై చర్చ

  • మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు ఇవ్వాలనే అంశంపై చర్చ
  • నేడు అర్ధరాత్రి తర్వాత గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపించే అవకాశం
  • మంత్రులుగా అవకాశం దక్కిన వారికి ఫోన్ చేయనున్న చంద్రబాబు

కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. వారికి టీడీపీ అధినేత స్వాగతం పలికారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ఆయన నివాసానికి వచ్చారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ కూడా టీడీపీ అధినేత నివాసానికి వచ్చారు. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరెవరికి పదవులు ఇవ్వాలి? ఏ పదవి ఇవ్వాలి? అనే అంశంపై చర్చించారు. బీజేపీ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీరి భేటీ దాదాపు 45 నిమిషాలు కొనసాగింది.

అమిత్ షాతో భేటీ తర్వాత… టీడీపీ, జనసేనల నుంచి కేబినెట్లోకి తీసుకునే వారి జాబితాను సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి తర్వాత గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబు ఫోన్ చేసి సమాచారం అందించనున్నారు. ఇప్పటికే పలువురు ఆశావహులు విజయవాడ, గుంటూరులలో మకాం వేశారు. చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్ కోసం వేచి చూస్తున్నారు. 


 
 

Related posts

100 లోక్‌సభ స్థానాలు.. 15 రాష్ట్రాలు.. 67 రోజులు.. భారత్ జోడో న్యాయ్ యాత్ర విశేషాలివే!

Ram Narayana

బీఆర్ యస్ అవినీతి పార్టీ …దాని అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ …జెపి నడ్డా ధ్వజం…

Ram Narayana

నితీశ్ కుమార్… మోదీ పాదాలను తాకి బీహార్‌ను అవమానించారు: ప్రశాంత్ కిశోర్

Ram Narayana

Leave a Comment