Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ మాట వినను విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు …

టీవీ ఛానల్ పెడుతున్నా.. ఈసారి జగన్ చెప్పినా వినను: విజయసాయిరెడ్డి

  • జగన్ వద్దన్నారని గతంలో ఆగిపోయానన్న విజయసాయి
  • కుల, మతాలకు అతీతంగా తన ఛానల్ పని చేస్తుందని వ్యాఖ్య
  • తన ఛానల్ న్యూట్రల్ గా ఉంటుందని వెల్లడి

టీవీ ఛానల్ పెడతానని గతంలో తాను ప్రకటించానని… కానీ, తమ అధినేత జగన్ వద్దని చెప్పడం వల్ల ఆగిపోయానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఛానల్ పెట్టి నష్టపోవద్దని, మనకు ఇప్పటికే ఒక ఛానల్ ఉంది కదా అని జగన్ చెప్పారని… దీంతో, ఛానల్ పెట్టాలనే ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. కానీ ఈసారి మాత్రం తగ్గేదే లేదని… జగన్ చెప్పినా, మరెవరు చెప్పినా విననని… ఛానల్ పెట్టి తీరుతానని అన్నారు. తన ఛానల్ కుల, మతాలకు అతీతంగా నిజాయతీగా పని చేస్తుందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ… వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా తన ఛానల్ పని చేస్తుందని తెలిపారు. తన ఛానల్ న్యూట్రల్ గా ఉంటుందని చెప్పారు. 

తాను భూములు ఆక్రమించానని ఆరోపిస్తున్నారని… ఇదంతా తప్పుడు ప్రచారమని విజయసాయి అన్నారు. ఒక ఎంపీగా తాను ఎంతో నిజాయతీగా బతుకుతున్నానని… తాను భూములు ఆక్రమిస్తే వాటిని తిరిగి తీసుకోవాలని, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

Related posts

38 మంది అసెంబ్లీ అభ్యర్థులతో మరో జాబితాను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్

Ram Narayana

తన భార్య తనపై పోటీ చేస్తుండటంపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ స్పందన…

Ram Narayana

కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక!

Ram Narayana

Leave a Comment