Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అన్యాయం …

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేల కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో మాదిగ ఎమ్మెల్యేలు శామ్యూల్, కవ్వంపల్లి సత్యనారాయణ..వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుందనే ఉహాగానాలు ఉండటంతో.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని వారు సీఎం రేవంత్ కు విజ్ఙప్తి చేశారు . ఎమ్మెల్యేల వినతికి సీఎం రేవంత్ కూడా సానుకూలంగా స్పందించి.. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌ను కలవాలని సూచించనట్లు తెలుస్తుంది. ఒకవేళ అధిష్టానం సహకరిస్తే ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ కూడా ఎమ్మెల్యేలలో నెలకొంది.

మాదిగలకు బీఆర్ యస్ ప్రభుత్వంలోనూ అన్యాయం జరిగిందని కేసీఆర్ మాదిగలను మోసం చేశారని భావన మాదిగ సామజిక వర్గంలో ఉంది …అలాంటిది కాంగ్రెస్ లో రిపీట్ కావద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో కోరుకోవడం విశేషం …రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండటం తరతరాలుగా వారు కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో తమకు అన్యాయం జరిగిందంటూ చేస్తున్న విజ్ఞప్తులపై సీఎం ఒకే అన్న కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి …!

Related posts

కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారూ?: వైఎస్ షర్మిల

Ram Narayana

పథకాలు అమలు కాకూడదనే దుర్బుద్ధితో ఉన్న బీఆర్ యస్ …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

తుమ్మల కాంగ్రెస్ లోకి స్వాగతిస్తాం …పొదెం వీరయ్య …!

Ram Narayana

Leave a Comment