తెలంగాణ వార్తలు

తెలంగాణాలో వర్షాలు మరో రెండు రోజులు …వాతావరణ శాఖ

  • ఈరోజు, రేపు భద్రాద్రి కొత్తగూడెం సహా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • రేపు, ఎల్లుండి వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. 

ఈరోజు, రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

Related posts

చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ వీడింది.. కారణం అదే!

Ram Narayana

హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కారణం ఇదే!

Ram Narayana

హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను…గుజరాత్‌ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు..

Ram Narayana