Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

డాక్టర్ పై హత్యాచారం కేసు సీబీఐకి అప్పగించిన కలకత్తా హైకోర్టు!

  • బెంగాల్ లో ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్ పై అత్యాచారం, హత్య
  • నిందితుడి అరెస్ట్
  • ఈ కేసు పత్రాలను వెంటనే సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు

బెంగాల్ లోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఓ ట్రెయినీ డాక్టర్ పై అత్యాచారం చేసి, అనంతరం హత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

డాక్టర్ పై హత్యాచారం కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు, తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న డాక్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ… డాక్టర్లు ధర్నా విరమించుకోవాలని, రోగులకు సేవ చేయడం వైద్యుల పవిత్రమైన బాధ్యత అని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. 

ఇటీవల పీజీ వైద్యురాలి మృతదేహం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా పడి ఉండడం సంచలనం సృష్టించింది. ఆమెపై ఓ పౌర పోలీసు వాలంటీరు హత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Ram Narayana

మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఛార్జిషీట్… పరిగణనలోకి తీసుకున్న కోర్టు..

Ram Narayana

వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగించిన సీబీఐ కోర్టు

Ram Narayana

Leave a Comment