Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి ,పథకాలు అమల్లో అగ్రగామిగా ఖమ్మం …స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భట్టి సందేశం

అభివృద్ధి ,పథకాలు అమల్లో అగ్రగామిగా ఖమ్మం …స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భట్టి సందేశం
ఖమ్మంలో జాతీయ జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి .. !
ప్రజలు ఇచ్చిన భాద్యతను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యం
హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి

అభివృద్ధి సంక్షేమం పథకాల అమల్లో అగ్రగామిగా ఖమ్మం జిల్లా ఉందని అందుకు ప్రజాప్రతినిధులు , అధికారుల కృషే కారణమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు …78 స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు… జాతీయజెండాను ఆవిష్కరించి ,పోలిసుల గౌరవ వందనం స్వీకరించారు …అనంతరం స్వాతంత్ర సమరయోధులను కలిసి సత్కరించారు …జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చారు …ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటిగా అమలు చేస్తున్నదని అన్నారు ..ఉచిత బస్సు ప్రయాణం , ఉచిత గ్యాస్ సిలిండర్లు ,రాజీవ్ ఆరోగ్యశ్రీ , అమలు చేస్తున్నట్లు వివరించారు …సొంత ఇంటికల నెరవేర్చేందుకు నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల గృహాలను నిర్మించనున్నట్లు తెలిపారు … గృహ జ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకుంటున్న వారికీ ఉచిత పథకాన్ని ప్రవేశ పెట్టమని అన్నారు ..

దేశంలో ఎక్కడ ,ఎన్నడూ లేని విధంగా 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ జరుగుతుందని అందులో భాగంగా మొదటి రెండు విడతల్లో లక్షన్నర వరకు ఉన్న రుణాల కింద జిల్లాలో 91 వేల 799 మంది రైతులకు 520 కోట్ల 77 లక్షల రూపాయలు మాఫీ చేయటం జరిగిందన్నారు …జిల్లాలో మొత్తం 3 లక్షల 38 వేల మంది రైతులు 5689 .20 కోట్ల లబ్ది పొందుతున్నారని పేర్కొన్నారు …జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల భవనాలకు 40 ఎకరాలను కేటాయించడం జరిగిందని అన్నారు…సీతారామ ఎత్తిపోతల ద్వారా 47 వేల 381 ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు…రైతు బీమా , పట్టకు పెట్టుబడి పథకం విద్యుత్ శాఖ అభివృద్ధి , ఎస్సీ , ఎస్టీల ,బీసీల , మైనార్టీల, మహిళా , శిశు ,వికలాంగుల , వయోవృద్ధుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించిందని అన్నారు …ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధరణి స్థానే అత్యత్తమ రెవెన్యూ చట్టం తెచ్చేందుకు చర్యలు చేపట్టిందని భట్టి వివరించారు …మేయర్ పూనుకొల్లు నీరజ , జిల్లా కలెక్టర్ ముజమల్ ఖాన్ , సీపీ సునీల్ దత్ ఇతర అధికారులు పాల్గొన్నారు …

Related posts

ఆత్మ గౌరవం కోసం పోరాటాలు -ప్రొఫెసర్ కోదండరాం

Drukpadam

జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు బీభత్సం.. రెండున్నర నెలల పసికందు మృతి

Drukpadam

మమ్మల్ని భారత్‌కు పంపించేయరూ.. బహ్రెయిన్‌లోని తెలుగు కార్మికుల గోడు!

Drukpadam

Leave a Comment