వరద భాదిత జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు సహాయం!
30 మంది జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు ,బియ్యం, పప్పులు పంపిణి
కరోనా సమయంలో కూడా జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకున్న వద్దిరాజు
వద్దిరాజు దాతృత్వానికి కృతఙ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు
బీఆర్ యస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వరద భాదిత ప్రాంతాల్లో నివసిస్తూ సర్వం కోల్పోయిన జర్నలిస్టులకు బియ్యం ,ఉప్పులు ,పప్పులు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు .సుమారు 30 మంది జర్నలిస్టులు మున్నేరు ఇరువైపులా నివాసం ఉంటున్నారు …మొన్నటి వరదలకు వారు సర్వం కోల్పోయారు … కట్టుబట్టలతో బయటకు వచ్చారు …దీంతో వారిని ప్రత్యేకంగా ఆదుకోవాలని జర్నలిస్టు సంఘాలు చేసిన విజ్ఞప్తికి వద్దిరాజు స్పందించారు …వెంటనే వారి ఆఫీస్ సిబ్బందికి చెప్పి జర్నలిస్టులకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ప్యాక్ చేయించారు …ప్రతి ఒక్కరికి ఒక కిట్ ను ఎంపీ స్వయంగా అందించారు …సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారనే పేరు ఆయనకు ఉంది …ఎవరైనా కష్టాల్లో ఉన్నానని వస్తే ఉత్తగా పంపించే మనస్తత్వం కాదు ఆయనది … కరోనా సమయంలో కూడా వందలాది కుటుంబాలకు ఆయన సహాయం అందించారు .. అనేక మంది జర్నలిస్టులను కష్టకాలంలో మానవత్వంతో ఆదుకున్నారు … జర్నలిస్టులకు ఫ్రెండ్ గా ఆయనకు పేరుంది … ఈపంపిణీ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణు గోపాల్ ,జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు , ఎలక్ట్రినిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ రావు , ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ రావు ,టీజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ , చిర్ర రవి , గుద్దేటి రమేష్ , ఫోటో గ్రాఫర్ రాజు , ఫెడరేషన్ నాయకులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు , ఫోటోగ్రాఫర్ రాజు తదితరులు పాల్గొన్నారు …