Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిశోర్..నాయకత్వం తన చేతుల్లో లేదని వెల్లడి!

  • జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన ప్రశాంత్ కిశోర్
  • పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు వెల్లడి
  • కొత్త పార్టీ నాయకత్వం తన చేతుల్లో లేదన్న ప్రశాంత్ కిశోర్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ‘జన్ సురాజ్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందినట్లు చెప్పారు. బీహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే ఈ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో లేదన్నారు. రెండేళ్లుగా ఈ పార్టీ కోసం శ్రమించిన వారే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా బీహార్ ప్రజలు ఆర్డేజీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని, ఇక ఈ సంప్రదాయం అంతం కావాలన్నారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది ఏమీ కాదన్నారు. జన్ సూరజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని తెలిపారు.

Related posts

తెలంగాణాలో కాంగ్రెస్ గెలవబోతుంది..రాహుల్ గాంధీ …!

Ram Narayana

మహారాష్ట్రలో బీఆర్ఎస్ చేసేదేమీ లేదు.. తెలంగాణలో మా సత్తా ఏంటో బీఆర్ఎస్ కు చూపిస్తాం: శివసేన

Ram Narayana

లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్న కాంగ్రెస్

Ram Narayana

Leave a Comment