తెలంగాణ వార్తలు

గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి సోమవారం మంత్రి తుమ్మల…!

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రేపు సోమవారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు.

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన స్వంత జిల్లా నిజామాబాద్ జిల్లా లో పర్యటించడం తో వాయిదా పడిన విషయం తెలిసిందే.

కాగా ముందుగానే ప్రకటించినట్టుగా సోమవారం నాడు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాగా ఇప్పటికే మొదటి రోజు వైద్య, ఆరోగ్య శాఖ దామోదర్ రాజా నర్సింహ గారు, రెండో రోజు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు..

Related posts

బాపు ఘాట్ వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు..

Ram Narayana

లీగల్ నోటీసులు ఇస్తా.. సోషల్ మీడియా ప్రచారంపై జగ్గారెడ్డి సీరియస్

Ram Narayana

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం…

Ram Narayana