Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబంలో విషాదం!

  • స్టాలిన్ బావ మురసోలి సెల్వమ్ కన్నుమూత
  • గుండెపోటుతో మృతి చెందిన సెల్వమ్
  • బెంగళూరు వెళ్లి నివాళులు అర్పించిన ఎంకే స్టాలిన్, ఉదయనిధి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం స్టాలిన్ బావ మురసోలి సెల్వమ్ కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, సీఎం స్టాలిన్, ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బెంగళూరు వెళ్లారు. మురసోలి సెల్వమ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

85 ఏళ్ల మురసోలి సెల్వమ్ గతంలో తమిళ దినపత్రిక మురసోలికి ఎడిటర్ గా వ్యవహరించారు. మురసోలి పత్రిక డీఎంకే పార్టీ అధికారిక గొంతుకగా పేరుపొందింది. 

సెల్వమ్… డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానాధికి మేనల్లుడు. సెల్వమ్… కరుణానిధి కుమార్తెనే వివాహం చేసుకున్నారు. అంతేకాదు, సెల్వమ్… కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ కు తమ్ముడు. మురసోలి సెల్వమ్ ఇవాళ బెంగళూరులో గుండెపోటు కారణంగా మృతి చెందారు.

Related posts

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో మరింతమంది ప్రమేయం!

Ram Narayana

కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!

Ram Narayana

జీవిత భాగస్వామి ఉండగా ‘సహజీవనం’ ముస్లిం సూత్రాలకు విరుద్ధం: అలహాబాద్ హైకోర్ట్ తీర్పు

Ram Narayana

Leave a Comment