Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

బంగారమే బెస్ట్… ప్రతి 10 మంది భారతీయుల్లో ఏడుగురి ఆలోచన ఇదే!

  • బంగారంపై భారతీయుల్లో అమిత మక్కువ 
  • ఇతర పెట్టుబడుల కంటే బంగారంపై పెట్టుబడికి ఆసక్తి
  • ఇది ఎంతో మేలని భావిస్తున్న ప్రజలు

భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మగువలకే కాదు మగవాళ్లకు కూడా పసిడి ఆభరణాలపై మోజు ఎక్కువే. తాజాగా ఓ సర్వేలో ఆసక్తికర అంశం వెల్లడైంది. ప్రతి 10 మంది భారతీయుల్లో ఏడుగురు బంగారం ఓ సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారట. 

ఇతర అంశాల్లో డబ్బును పెట్టుబడిగా పెట్టడం, ఇతర ఆస్తులు కొనుగోలు చేయడం కంటే, బంగారం కొనుగోలు చేసి దాచుకోవడం సరైన చర్య అన్నది చాలామంది అభిప్రాయమని సర్వే వెల్లడిస్తోంది. 

మనీవ్యూ సంస్థ 3 వేల మందిని  ప్రశ్నించగా, వారిలో 85 శాతం మంది బంగారం ఓ విలువైన ఆస్తి అని పేర్కొన్నారు. స్థిరాస్తుల కంటే సంపద రూపంలో భద్రపరుచుకోవడానికి పుత్తడే తగినదని అభిప్రాయపడ్డారు. 

అది కూడా 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు సైతం బంగారంపై అత్యంత నమ్మకం వెలిబుచ్చినట్టు సర్వే చెబుతోంది. భవిష్యత్ అవసరాల కోసం, దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా, రిటైర్మెంట్ అనంతరం కొంత సంపదను సృష్టించుకోవాలనుకుంటే… అది భౌతికంగా అయినా సరే, డిజిటల్ రూపంలో అయినా సరే… అందుకు పసిడి తగిన మార్గం అని ప్రజలు భావిస్తుండడం విశేషం. 

మనీవ్యూ సంస్థకు చెందిన చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుష్మ అబ్బూరి మాట్లాడుతూ, బంగారాన్ని ప్రజలు కాలాతీత ఆస్తిగా పరిగణిస్తున్నారని, ముఖ్యంగా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు విప్లవాత్మకంగా మారనుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ రూపంలో బంగారాన్ని భద్రపరుచుకోవడం ఎంతో సులభమైన, భద్రతతో కూడిన వ్యవహారంగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఆమె తెలిపారు.

Related posts

చదరపు గజానికి రూ. 29 లక్షలా?.. అపార్ట్​ మెంట్లు ఇంత రేటా?

Ram Narayana

17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన ‘బోయింగ్’

Ram Narayana

కియా, టెస్లా కార్లలో లోపాలు.. లక్షకు పైగా కార్లు వెనక్కి..!

Ram Narayana

Leave a Comment