Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

జర్నలిస్టుపై దాడి పట్ల టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఖండన

ఇల్లందులో దారుణం చేటుచేసుకుంది …ఒక రౌడీ మూక జర్నలిస్టుపై హత్య యత్నం చేయడం సిగ్గుమాలిన చర్య …ఇది నాగరిక ప్రపంచానికి తీరని అవమానం …సమాజంలో అక్రమమార్గాల ద్వారా సంపాదనకు తెగబడిన సంఘ విద్రోహ శక్తులే ఇలాంటి దాడులకు పాల్పడతాయి…చంపే అధికారం వారికీ ఎవరిచ్చారు …ఇది అత్యంత పాశవిక చర్య …నాగరిక సమాజంలో దాడులకు తావు లేదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కె .విరాహత్ అలీ , కె .రాంనారాయణలు అన్నారు ..నిట్ఠా సుదర్శన్ పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు …నిందితులు ఎంతటివారైనా పట్టుకొని చట్టప్రకారం శిక్షంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు …ఒక పక్క మీడియా స్వేచ్ఛ గురించి నిరంతరం చెప్పే రాజకీయ నేతలు సంఘవిద్రోహ శక్తులు దాడులకు పాల్పడటం సిగ్గు చేటు .రాత్రి సమయంలో కాపుకాసి మారణాయుధాలతో దాడికి దిగిన దుండగులు రక్తపు మడుగులో ఉన్న సుదర్శన్ ను చూసి చనిపోయారని వదిలేశారని వారు అన్నారు ..గడిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరపున సుదర్శన్ విస్తృత ప్రచారం నిర్వహించడమే ఆయన చేసిన నేరమా అని వారు ప్రశ్నించారు ..

గతంలోనూ ఇల్లందుకు చెందిన కొందరు రౌడీషీటర్లూ, రాజకీయనెతలతో తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు సుదర్శన్ పోలీసులకు ఫిర్యాధు చేసిన పట్టించుకోలేదని సుదర్శన్ చెప్పడాన్ని వారు గుర్తు చేశారు .. ఖమ్మంలో ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు .

నిందితులను కఠినంగా శిక్షించాలి …టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఇల్లందు డివిజన్

ఇల్లందు మండలం జగదాంబ గుంపు సమీపంలో గురువారం రాత్రి నిట్ట సుదర్శన్ (ఆదాబ్ హైదరాబాద్) రిపోర్టర్ పై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడిలో గాయపడిన అతను ప్రస్తుతం ఖమ్మం లో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణమైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇల్లందు డివిజన్
టీయుడబ్ల్యూజే (ఐజేయు) కమిటీ డిమాండ్ చేసింది . పోలీస్ అధికారులు దీనిపై స్పందించి దర్యాప్తు ప్రారంభించి నిందితులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది …

ఇల్లందులో జర్నలిస్ట్ పై దాడి ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్ పై మండలంలోని జగదాంబగుంపులో జరిగిన దాడి ఘటనలో సిఐ బత్తుల సత్యనారాయణ ఏడుగురుపై కేసు నమోదు చేశారు. జగదాంబ గుంపులోని చాయ్ షాప్ వద్దకు వచ్చిన సుదర్శన్ పై వంశీ, ప్రేమ్, ఉదయ్, యాకూబ్ లు అకారణంగా బీరుబాటిల్ తో, కర్రలతో దాడి చేశారు. గాయాలైన సుదర్శన్ ను స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న సిఐ సత్యనారాయణ సుదర్శన్ ను పరిశీలించి ఆయన వాంగ్మూలంతో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారితోపాటు వారికి సహకరించిన అనిల్, ప్రసాద్, నాగేశ్వరరావు లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

అధికారుల నిర్లక్ష్యణ భారీ నష్టానికి కారణం…సిసిఐ నేత భాగం హేమంతరావు

Ram Narayana

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

Ram Narayana

సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ప్రమాదం లేదు…

Ram Narayana

Leave a Comment