Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడులు…

  • రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో పార్టీ
  • భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం
  • తనిఖీలు చేసి పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు

హైదరాబాద్ సమీపంలోని జన్వాడ ఫామ్‌హౌస్‌పై గత రాత్రి సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పెద్ద శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. తనిఖీలు నిర్వహించి పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పార్టీలో 14 మంది మహిళలు సహా 42 మంది పాల్గొన్నట్టు గుర్తించారు. పరీక్షల్లో ఓ వ్యక్తి కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. 

ఘటనా స్థలం నుంచి విదేశీ మద్యం, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా, రాజ్ పాకాల గెస్ట్‌హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిదిగా చెబుతున్నారు.

Related posts

హైదరాబాద్ లో బెగ్గర్ ఆదాయం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Ram Narayana

సౌత్ కొరియాలో రేవంత్ రెడ్డి బృందం పర్యటన… హ్యుండాయ్ అధికారులతో భేటీ!

Ram Narayana

బీఆర్ యస్ లో అంతా గుంభనం…మరికొద్ది రోజుల్లో సీట్ల ప్రకటన అంటూ సంకేతాలు …

Drukpadam

Leave a Comment