Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అయ్యప్ప ప్రసాదానికి ఆ రుచి ఎలా వస్తుందో తెలుసా…

అయ్యప్ప ప్రసాదానికి ఆ రుచి ఎలా వస్తుందో తెలుసా…

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రసాదాల్లో ఒకటి తిరుపతి లడ్డూ అయితే.. మరొకటి శబరిమల అరవణ పాయసం ప్రసాదం.. తిరుపతి ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో శబరిమలలో దొరికే ఈ అరవణ పాయసం ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. 41 రోజుల కఠిన మండల దీక్ష తర్వాత ఇరుముడితో మణికంఠుడి దర్శనానికి వెళ్లే స్వాములు తెచ్చే ఈ ప్రసాదం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది స్వాములు అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. వారందరి కోసం 80 లక్షల అరవణ ప్రసాదాన్ని తయారుచేస్తుంటారు.

పోషకాల నిధి..
రుచిలోనే కాదు దీనిని ప్రసాదంగా తీసుకోవడం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎముకలను పిండి చేసే చలిలో శబరిమలకు వచ్చే స్వాములకు శారీరంగా ఎన్నో రకాలైన పోషకాలను అందించేలా ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. చలికాలంలో దీనిని తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తుంది. ఈ ప్రసాదానికి ఇంత రుచి ఎలా వస్తుందో తెలియాలంటే దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాల్సిందే. నిజానికి చాలా కొద్ది పాటి పదార్థాలనే ప్రసాదం కోసం వాడుతుంటారు. అందులో తాటి బెల్లం, ఎర్ర బియ్యం, నెయ్యి, ఎండుకొబ్బరి, శొంఠి పొడి, యాలకులు, పచ్చకర్పూరం, ఎండు ద్రాక్ష ను పాయసం తయారీలో వాడతారు.

కేరళ రెడ్ రైస్..
ఇందులో వాడే ప్రత్యేకమైన ఎర్ర బియ్యాన్ని మావెల్లిక్కర ట్రావెన్‌కోర్ దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి సరఫరా చేస్తుంటారు. చూసేందుకు ముదురు నలుపు రంగులో కనిపించే ఈ పదార్థానికి అసలైన రుచి ఇందులో వాడే బియ్యం వల్లే వస్తుందని అంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి గాంచిందని చెప్తారు.

Related posts

ఢిల్లీలో ఆప్ నేతల అత్యవసర సమావేశం…

Drukpadam

హరిద్వార్‌ జైలులో ‘రామ్‌లీలా’ నాటకం.. వానరులుగా నటించి పరారైన ఇద్ద‌రు ఖైదీలు!

Ram Narayana

ఇక అడ్డంకులు లేని ప్రయాణం.. కొత్త టోల్ వ్యవస్థకు రూపకల్పన

Ram Narayana

Leave a Comment