సెక్స్ వర్కర్ ముసుగులో విటులను ఆకర్షించి దోపిడీకి పాల్పడుతున్న మహిళను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారి తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ భవన్ ఏరియాలో ఉండే ముస్కాన్ దాబెల అలియాస్ అస్మా ఉన్నిసా భర్త ఏడాది కింద చనిపోయాడు.
కుటుంబ పోషణ కోసం సెక్స్ వర్కర్ గా మారింది. రంగమహల్ చౌరస్తా వద్ద రాత్రి సమయంలో విటులను ఆకర్షిస్తూ అమాయకులను గుర్తించి బెదిరింపులకు పాల్పడుతోంది. బ్లేడుతో బెదిరించి అందినకాడికి దండుకుని పారిపోతుంది. ఫలక్ నమా ఏరియాకు చెందిన గులాం మస్తాన్(25) ఇటీవల అప్జల్ గంజ్ నుంచి రంగమహల్ చౌరస్తాకు వెళ్తుండగా అస్మా ఉన్నిసా కనిపించడంతో ఆగాడు.