నల్గొండలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ భూముల సర్వే….
- కొలిక్కి వస్తున్న ఇంటి స్థలాల సమస్య
- రెండు మూడు రోజుల్లో కలెక్టర్ కు చేరనున్న నివేదిక….
నల్లగొండ పట్టణ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి గతంలో ప్రభుత్వం కేటాయించిన భూముల సర్వేను శుక్రవారం నాడు పోలీస్ శిక్షణ కేంద్రం ఎదుట ఉన్న 378,451 సర్వే నెంబర్లలో భూమిని సర్వేయర్లు భూమిని సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశాల మేరకు నల్లగొండ ఆర్డిఓ, నల్లగొండ తహసిల్దార్ ఈ సర్వే పనులను తమ శాఖకు సంబంధించిన సర్వేయర్ల ద్వారా సర్వేను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేవరకొండ రోడ్ లోని నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న 699 సర్వేనెంబర్ భూమిలో సర్వే పూర్తి చేయడం జరిగింది. ఈ భూములకు సంబంధించిన పూర్తి రిపోర్టు రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి చేరనుంది. శుక్రవారం నాడు జరిగిన సర్వే పనులను జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు , నల్లగొండ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఫహీముద్దీన్, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు, హౌసింగ్ సొసైటీ సభ్యులు గుండెగోని జయశంకర్, హౌసింగ్ సొసైటీ సభ్యులు, నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి ,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గాదె రమేష్ పరిశీలించడం జరిగింది.