Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రైతుబీమా డబ్బులు కొట్టేసిన ఏఈఓ.‌.!!

మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా నగదును అందించాల్సిన ఏఈఓ బాధిత కుటుంబ నిరక్షరాస్యతను ఆసరా చేసుకొని డబ్బులు కాజేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గేటు తండాలో చోటుచేసుకుంది..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గుండ్రాతిమడుగు గేటుతండాకు చెందిన గిరిజనరైతు ఈ ఏడాది జూన్ 9న మృతి చెందాడు. నామినీ గా ఉన్న ఆయన భార్య బానోత్ ఇరానీ స్థానికుల సహాయంతో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 10న బీమా సొమ్ము ఐదులక్షల రూపాయలు ఇరానీ ఖాతాలో జమయ్యాయి. కానీ ఆ..విషయం ఆమెకు తెలియలేదు. ఇరానీ నిరక్షురాస్యురాలు కావడంతో… ఆమె నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఏఈఓ బానోత్ కళ్యాణ్ కొన్ని సంతకాలు చేస్తే నగదు వెంటనే చేతికి వస్తాయని నమ్మించి చెక్కుపై సంతకం చేయించుకున్నాడు. అక్టోబర్ 19న ఇరానీ ఖాతాలో ఉన్న ఐదులక్షల రూపాయలను తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. నెల తర్వాత ఇరానీ గుండ్రాతిమడుగులోని బ్యాంకుకు వెళ్లి ఆరాతీయగా ఆమె ఖాతాలోని నగదు ఏఈఓ కళ్యాణ్ ఖాతాకు బదిలీ అయిందని అధికారులు తెలిపారు. దీనిపై ఏఈఓ కళ్యాణ్ ను బాదితులు ప్రశ్నించగా వారంరోజుల్లో డబ్బులు తీసుకోండంటు ఓ..చెక్కు ఇచ్చాడు. కానీ ఆ చెక్కు కూడా బౌన్స్ అయింది. దీంతో దిక్కుతోచని బాధితురాలు ఇరానీ లబోదిబోమంటూ కురవి పోలీసులను ఆశ్రయించారు.

గతంలో కళ్యాణ్ విధులు నిర్వహించిన చోట కూడా ఇలాంటి అవకతవకలు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించాలనే డిమాండ్ పెరుగుతుంది …

Related posts

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ ముఠా గుట్టురట్టు!

Drukpadam

స్కూల్​ లో గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం.. తమిళనాడులో విషాదం!

Drukpadam

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో సీబీఐ క‌స్ట‌డీకి అభిషేక్ రావు!

Drukpadam

Leave a Comment