Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

భూభారతి చట్టం కాకుండానే పత్రికల్లో ప్రకటనలు….సభాహక్కుల ఉల్లంఘన బీఆర్ యస్

శాసనసభ ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ… శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించినందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్ శాసనసభ పక్షం.

భూభారతి చట్ట ప్రకటనలపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు.శాసనసభా హక్కుల రక్షణ కోసం స్పీకర్‌కు వినతి. శాసనసభ హక్కులను కాపాడాలన్న భారత రాష్ట్ర సమితి పక్షం.
2024 డిసెంబర్ 19న దినపత్రికల్లో చట్ట ప్రకటనలు జారీ.ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వ తీరుపై అగ్రహం. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించిన రాష్ట్ర ప్రభుత్వమన్న బీఆర్ఎస్.శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహారం. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొన్న ప్రభుత్వం.నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను మోసగించిన చర్య అన్న బీఆర్ఎస్. రాష్ట్ర శాసనసభ గౌరవానికి దెబ్బతీసిన ప్రభుత్వమని ఆరోపణ. భారత రాజ్యాంగ ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని కలిగించిందని ఈ నోటీసులో పేర్కొన్నారు ..

Related posts

98 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం… లాస్యనందిత, మైనంపల్లి సహా 14 మంది ఇంగ్లీష్‌లో ప్రమాణం

Ram Narayana

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం!

Ram Narayana

నాడు కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తప్ప ఎవరూ మాట్లాడలేదు: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

Ram Narayana

Leave a Comment