అరెస్ట్ ఆపండి ….విచారణ జరపండి ..కేటీఆర్ పై కేసులో హైకోర్టు
ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ కు రిలీఫ్
10 రోజుల వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం
కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్ వర్తించదని….
సీనియర్ అడ్వకేట్ సుందరం వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ కు ఆదేశాలు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్ వర్తించదని సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వకేట్ సుందరం వాదనలతో హైకోర్టు ఏకీభవించింది ..ఆధారాలు సమర్పించాలని ఏసీబీకి వారం రోజుల గడువు ఇచ్చింది .. విచారణ సందర్భంగా ఏసీబీకి సహకరించాలని కూడా కోర్ట్ ఆదేశించింది ..
Save or share this story as a newspaper-style Epaper Clip: