Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

అల్లు అర్జున్ వివాదంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు!

  • రేవంత్ అసెంబ్లీలో చెప్పింది వాస్తవాలే అయితే తాను కూడా ఏకీభవిస్తానని వెల్లడి
  • అల్లు అర్జున్ ను చాలామంది పరామర్శించారన్న విష్ణుకుమార్ రాజు
  • బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్న

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వివాదం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది వాస్తవాలే అయితే, తాను కూడా ఆయనతో ఏకీభవిస్తానని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. 

జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ ను చాలామంది పరామర్శించారని, బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. 

బెనిఫిట్ షోలకు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని, అల్లు అర్జున్ వెళ్లడంతోనే ఇదంతా జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళుతుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారని చెప్పినప్పుడు, బాధ్యతగా అక్కడ్నించి వెళ్లిపోతే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Related posts

పి.డి.ఎస్.యు స్వర్ణోత్సవ సంబరాలు …

Ram Narayana

అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత… విద్యార్థి సంఘాల ఆందోళన

Ram Narayana

టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన బీఆర్ నాయుడు.. కొలువుదీరిన కొత్త పాలకమండలి!

Ram Narayana

Leave a Comment