హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో హైడ్రా కూల్చివేతలు…

  • భగీరథమ్మ చెరువు బఫర్ జోన్‌లో కూల్చివేతలు
  • ఇటీవల అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించినట్లు ఫిర్యాదులు
  • జేసీబీలతో కూల్చివేసిన అధికారులు

హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేయిస్తున్నారు. ఈ చెరువు బఫర్ జోన్‌లోని రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో ఇటీవల ఆక్రమణదారులు రేకుల షెడ్లు నిర్మించారు.

ఈ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి భగీరథమ్మ చెరువు వద్దకు చేరుకొని జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు.

Related posts

రేపటి నుంచి మూసీ ప్రక్షాళన… భారీ సంఖ్యలో ఆక్రమణలను తొలగించనున్న హైడ్రా!

Ram Narayana

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రియల్టర్ దారుణ హత్య!

Ram Narayana

వామ్మో వినాయకుని లడ్డుధర ఒకకోటి 87 లక్షలు …

Ram Narayana