పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కాసుల కోసం కక్కూర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న పెంచలయ్య శ్రీవారి హుండీలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ను దొంగిలించాడు.
దాన్ని ట్రాలీలో దాచి పెట్టి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అతనిపై తిరుమల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇంటి దొంగ.. చేతివాటం..
టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో అగ్రిగోస్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తి శ్రీవారి హుండీలోని ఓ బంగారు బిస్కెట్ను మాయం చేశాడు.
100 గ్రాముల గోల్డ్ బంగార బిస్కెట్ను మూడో కంటకి తెలియకుండా ట్రాలీలో తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారుల కళ్లలో పడ్డాడు. పెంచలయ్య దొంగిలించిన గోల్డ్ బిస్కెట్ 100 గ్రాములు బరువు ఉన్నట్లుగావిజిలెన్స్ అధికారులు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గతంలో కూడా ఇలాంటి చోరీలు ఏమైనా చేశాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అతడ్ని విచారిస్తున్నారు.