Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంలో ఊరట!

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై ఉన్న చంద్రబాబు
  • ఆ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం పిటిషన్
  • వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో తాము కల్పించుకోలేమని పేర్కొంది. అయితే, అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని సీఎం చంద్రబాబు తరఫు లాయర్ కు సూచించింది. ఈమేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ బుధవారం తీర్పు వెలువరించింది. 

వైసీపీ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలుకు వెళ్లిన చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తాజాగా బుధవారం విచారించింది. ఈ కేసులో చార్జిషీట్ కూడా దాఖలైన నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్ ను పరిశీలించలేమని పేర్కొంది.

Related posts

ఉచితాల‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌… కేంద్రం, ఎన్నిక‌ల క‌మిష‌న్‌ల‌కు నోటీసులు!

Ram Narayana

ఎట్టిప‌రిస్థితుల్లో అలా చేయ‌కూడ‌దు.. ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Ram Narayana

అవసరానికి భార్య స్త్రీధనం తీసుకుంటే భర్త దాన్ని తిరిగిచ్చేయాలి: సుప్రీం కోర్టు

Ram Narayana

Leave a Comment