Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మరాఠా యోధుడు …ఎన్నికల వ్యూహకర్త మధ్య ఏంజరుగుంది ?

మరాఠా యోధుడు …ఎన్నికల వ్యూహకర్త మధ్య ఏంజరుగుంది ?
-ప్రతిపక్ష పార్టీల సమావేశం లో ఏమి చర్చించారు.
-శరద్ పవార్ ప్రశాంత్ కిషోర్ మధ్య వరస భేటీల మతలబు ఏమిటి ??
-రాజకీయవర్గాలలో ఆశక్తి — ఆరా తీస్తున్న అధికార పార్టీ
-మూడోసారి భేటీ అయిన శరద్ పవార్, పీకే.. ఆంతర్యం తెలియక ఊహాగానాలు
– పీకే, పవార్ భేటీ పై ఎడతెగని చర్చ
-వెల్లడి కాని సమావేశ వివరాలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో నేడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్‌ను కలుసుకున్నారు. కలుసు కావడం సాధారణమే అను చెబుతున్నా కొద్దిరోజుల వ్యవధిలోనే మూడు సార్లు కలుసుకోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటి? …… అనేది ఇప్పుడు రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ … కమలానాథాలు సైతం దీనిపై ఆరా తీస్తున్నారు ….కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు కూడా కూపీ లగే ప్రయత్నాలు చేస్తున్నాయి. …. ఇటీవల ముంబైలో ఇద్దరి మధ్య జరిగిన సమావేశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీయగా, మొన్న కూడా వీరిద్దరూ ఢిల్లీలో కలుసుకున్నారు. ఇక నేడు మూడోసారి వీరిద్దరూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవార్ సారథ్యంలో ఎనిమిది పార్టీల నేతలు నిన్న ఢిల్లీలోని పవార్ నివాసంలో సమావేశమయ్యారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి థర్డ్ ఫ్రంట్‌గా ఏకీకరణ చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు వార్తలు వస్తున్నప్పటికీ అది నిజం కాదన్న వాదన కూడా ఉంది.

 

సమావేశం కావాలనే ఉద్దేశం యస్వంత్ సిన్హా ప్రతిపాదన ఆయన అందరికి ఆహ్వానాలు పంపారు. కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించాం కాని ఆ పార్టీ ప్రతినిధులు ఎవరు రాలేదు కాంగ్రెస్ ను వదిలి పెడుతున్నామన్నది నిజంకాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల సమావేశంలో పాల్గొన్న ఎవరికీ వివక్ష లేదని పేర్కొన్నారు. భావసారూప్యత కలిగిన అందరం ఒకచోట కలుద్దామని అనుకున్నాం అందులో భాగంగానే శరద్ పవార్ ను ఆతిధ్యం ఇవ్వమని అడిగాం అందుకు ఆయన అంగీకరించారు. ఈ భేటీలో పెద్ద విశేషం ఏమిలేదు మళ్ళీ మళ్ళీ కలుస్తాం అని యస్వంత్ సిన్హా తెలిపారు.

అసలు ఎనిమిది పార్టీల సమావేశంలో రాజకీయాలను గురించి కాకుండా దేశంలో కరోనా పరిస్థితులు ,ప్రజల ఉపాధి , ఆర్థిక పరిస్థితులపై ఒకరి భావాలు మరొకరం పంచుకున్నట్లు సిపిఎం నాయకుడు నీలోత్పల బసు తెలిపారు. కరోనా తో అన్ని వ్యవస్థలు దెబ్బతినడం ఆందోళనకర విషయమని అభిప్రాయపడినట్లు చెప్పారు.

 

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున పవార్‌ను బరిలోకి దింపడమే ఈ సమావేశం లక్ష్యమని తెలుస్తోంది. థర్డ్‌ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌లు ఎన్డీయేకు పోటీ ఇవ్వలేవన్న ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అయితే, పవార్, పీకే మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు వెల్లడి కాకపోవడం గమనార్హం. దీంతో వీరి మధ్య ఏ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

సమావేశానికి పవార్ , యస్వంత్ సిన్హా తో పాటు ఒమర్ అబ్దుల్లా , ఎస్పీ కు చెందిన ఘన శ్యామ్ తివారి , ఆప్ కు చెందిన సుశీల్ గుప్త ,బినయ్ బిస్వామ్ సిపిఐ , నీలోత్పల బసు సిపిఎం , జయంత్ చౌదరి ఆరెల్డీ , రిటైర్డ్ జస్టిస్ ఎపి శర్మ , మాజీ విదేశాంగ రాయబారి కే సి సింగ్ , సింగర్ జావేద్ అక్తర్ , ప్రముఖ న్యాయవాది తులసి , మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఖురేషి ఈ సమావేశానికి హాజరైయ్యారు. ఈ సమావేశం ముగిసిన తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ నాథ్ శరద్ పవార్ ఇంటికి వచ్చి కలిశారు . ఇద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం బయటకు రాలేదు….

Related posts

బీసీలు అధికారాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమయింది: ఆర్.కృష్ణయ్య!

Drukpadam

వైసీపీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే పై వేటు …

Drukpadam

అసలు సుఖేష్ ఎవరు …కేసీఆర్ పై కక్షతోనే ఈనాటకమంతా …ఎమ్మెల్సీ కవిత !

Drukpadam

Leave a Comment