- ఇటీవల సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసు
- ఆరు బృందాలతో భూపాలపల్లి పోలీసుల దర్యాప్తు
- భూ వివాదాల కారణంగా రేణుకుంట్ల సంజీవ తన బంధు, మిత్రులతో కలిసి హత్య చేసినట్లుగా నిర్ధారణ
- ఈ హత్య కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలింపు
ఇటీవల తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసుపై సస్పెన్స్ వీడింది. ఆరు బృందాలతో దర్యాప్తు చేసిన భూపాలపల్లి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ఈ హత్య కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
భూ వివాదాల నేపథ్యంలోనే రేణుకుంట్ల సంజీవ తన బంధు, మిత్రులతో కలిసి రాజలింగమూర్తిని ఈ నెల 19న హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఏ-1గా రేణుకుంట్ల సంజీవ, ఏ-2గా పింగలి సేమంత్ అలియాస్ బబ్లూ, ఏ-3గా మోరే కుమార్, ఏ-4గా కొత్తూరి కిరణ్, ఏ-5గా రేణికుంట్ల కొమురయ్య, ఏ-6గా దాసరపు కృష్ణ, ఏ-7గా రేణికుంట్ల సాంబయ్యను పోలీసులు చేర్చారు. అటు రాజలింగమూర్తి హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.