Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

చైనా ఆర్మీలో కీలక జనరల్‌ హి వైడాంగ్ అరెస్ట్‌…

  • సైనిక సమాచారం లీక్ చేశారని వైడాంగ్ పై ఆరోపణలు
  • కీలక పదవుల్లోని అధికారులను మార్చేస్తున్న అధ్యక్షుడు
  • ఫుజియాన్‌లో పనిచేసే పలువురు జనరల్స్‌ కూడా అరెస్ట్!

చైనా సైన్యంలో కీలకమైన మరో జనరల్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ సెక్రటరీ సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైడాంగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఫుజియాన్ లో విధులు నిర్వహిస్తున్న పలువురు జనరల్స్ ను కూడా అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హి వైడాంగ్ అరెస్టు వార్త ప్రస్తుతం చైనాలో సంచలనంగా మారింది. 

సైన్యంలో అత్యంత కీలకంగా భావించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు స్వయంగా చైనా అధ్యక్షుడే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కమిషన్ వైస్ చైర్మన్ ను అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వంలో, సైన్యంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను జిన్ పింగ్ ఇటీవల కాలంలో మార్చేస్తున్నారు. నాన్‌జింగ్‌ మిలిటరీ రీజియన్‌లో జనరల్‌ లాజిస్టిక్స్‌ అధిపతిగా పనిచేసిన ఝావో కేషిని కూడా ఇటీవల అరెస్టు చేశారు. గతేడాది కూడా మియావో లి అనే ఉన్నతస్థాయి సైనిక అధికారిని, అంతకుముందు ఏకంగా చైనా రక్షణ మంత్రిని అరెస్టు చేశారు.

Related posts

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ. పొడవైన హైవే!

Ram Narayana

చైనాలో భారతీయ ఇంజినీర్‌‌కు ఊహించని అనుభవం!

Ram Narayana

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల… ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

Ram Narayana

Leave a Comment