Kunamneni Sambashiva Rao
ఆంధ్రప్రదేశ్

నిబద్దత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయాం

  • సీపీఎం నేత శ్రీకాంత్ కు కూనంనేని నివాళి

ఖమ్మం : యర్రా శ్రీకాంత్ మృతితో నిబద్దత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజల పక్షాన పనిచేసే వ్యక్తులు అకాల మరణానికి గురైతే పేద, బడుగు, బలహీన వర్గాలకు, కార్మిక వర్గానికి తీరని నష్టమని పేర్కొన్నారు.  ఆదివారం గుండె పోటుతో మృతి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మృత దేహాన్ని మంగళవారం కూనంనేని సాంబశివరావు సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యర్రా శ్రీకాంత్ సతీమణి, ఐద్వా యర్రా సుకన్యను, శ్రీకాంత్ కుమారులను, ఇతర కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ యర్రా శ్రీకాంత్ కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమై పని చేసిందన్నారు. అనేక దశాబ్దాలుగా కార్మికుల, పేద ప్రజల సంక్షేమం, హక్కుల కోసం పోరాడారని తెలిపారు. శ్రీకాంత్ ఆకస్మిక మృతి వామపక్ష లౌకిక -శక్తులకు తీరని నష్టమన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంత రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య నాయకురాలు తాటి నిర్మల, ఐజెయు జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర రావు, సీపీఐ నగర నాయకులు నూనె శశిధర్, జ్వాలా నర్సింహారావు, ఎన్.శంకర్రావు, రవీంధర్, విజయ్ తదితరులు వున్నారు.

Related posts

కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

Ram Narayana

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

Ram Narayana

తిరుమ‌ల క‌ల్తీ ల‌డ్డు వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం.. న‌లుగురి అరెస్ట్‌!

Ram Narayana