Gold
బిజినెస్ వార్తలు

రూ. 96,000 దాటిన పసిడి ధర

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  దేశంలో బంగారం ధరలు శుక్రవారం రూ. 6 వేలకు పైగా పెరిగి రూ. 96,000 దాటింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 6,250 పెరిగి రూ. 96,450కి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సాయంత్రం రూ. 96,430  వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,223 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వాణిజ్య యుద్ధాల భయంతో పది రోజుల క్రితం ఔన్సు బంగారం ధర 3,200 డాలర్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా కాస్త తగ్గింది. అయితే ఇతర దేశాలపై టారిఫ్‌ ను తాత్కాలికంగా నిలుపుదల చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై మాత్రం కొనసాగించారు. దీంతో అమెరికాపై చైనా 125 శాతం టారిఫ్ విధించింది. టారిఫ్ యుద్ధం ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు తీవ్రమవుతుండటంతో, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Related posts

ఇంటర్న్‌షిప్‌కే నెలకు రూ.12.5 లక్షలు.. ఫ్రెషర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న ట్రేడింగ్ కంపెనీలు!

Ram Narayana

అమెజాన్‌లో కొత్త ఫీచర్ గమనించారా…?

Ram Narayana

జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రూ. 30 లక్షల వరకు పడిపోయిన కార్ల ధరలు..!

Ram Narayana