తెలంగాణ రాజకీయ వార్తలు ..

రేపు లేదా ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ …ముగ్గురు లేదా నలుగురికి చోటు …

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం ఖరారైందని వార్తలు వస్తున్నాయి…అయితే రేపు లేదా ఎల్లుండి విస్తరణని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది …ఇప్పటికి మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది …అయితే ఆయన రాష్ట్రవ్యవరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో సమాలోచనలు జరిపినట్లు సమాచారం … ఆశావహులు ఎక్కువగా ఉండటం, బెర్త్ లు తక్కువగా ఉండటంతో ఎవరి తీసుకోవాలి అనేదానిపై ఉత్కంఠ నెలకొన్నది …ఇప్పటికే సామజిక సమీకరణాలు , ప్రాంతాలు జిల్లాలు వారీగా పరిశీలన జరిగింది ..తెలంగాణ లో ఉన్న శాసనసభ్యుల సంఖ్యకు అనుగుణంగా 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది …అయితే గత ఏడాదిన్నర కాలంగా కేవలం 12 మంత్రులతోనే సరిపుచ్చుకున్నారు …అనేక ముఖ్యమైన శాఖలకు మంత్రులు లేరు …దీంతో నిర్ణయాలు తీసుకోండంలో జాప్యం జరుగుతుంది …అయితే ఇప్పుడు ఆరు ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 3 గ్గురు లేదా నలుగురికి పదవులు లభిస్తాయని ప్రచారం జరుగుతుంది …

ఎవరిని తీసుకునే అవకాశం ఉంది …

మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకునే అవకాశం ఉందనే దానిపై ఆసక్తినెలకొన్నది …ప్రధానంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది …అయితే ఇప్పటికే మంత్రివర్గంలో ఆయన సోదరుడు నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు ..ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి దాదాపు ఖాయం అంటున్నారు …ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి పేరు వినిపిస్తుంది …వాకాటి శ్రీహరి , దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరుకూడా వినిపిస్తుంది …ఎమ్మెల్సీ బీసీ కోట నుంచి విజయశాంతికి మంత్రి పదవి ఆశిస్తున్నారు …ఆదిలాబాద్ నుంచి ప్రేమ సాగర్ రావు కూడా తనకు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు ..పదవులు ఆశించి రానివారికి నిరాశ తప్పదు …

Related posts

పొత్తుల విషయంలో వార్తలన్నీ ఫేక్: ఆర్​ఎస్ ప్రవీణ్

Ram Narayana

రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన

Ram Narayana

తమ్ముడూ మందకృష్ణా మాదిగ! 30 ఏళ్లు పోరాడావ్.. మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలుకుతా: ప్రధాని మోదీ హామీ

Ram Narayana