జగన్‌పై కాంగ్రెస్ వివక్ష చూపడం వల్లే పార్టీ కనుమరుగు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరును ఆయన ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత జగన్ పట్ల కాంగ్రెస్ వివక్ష చూపిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జగన్‌తో మాట్లాడి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉండి ఉండేదని అన్నారు.
వైఎస్సార్ మరణం తర్వాత జగన్‌ను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో కనుచూపు మేరలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదని ఎద్దేవా చేశారు. జగన్ పట్ల నాడు చూపిన వివక్ష ఫలితం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అనుభవిస్తోందని అన్నారు. ఆయనను దూరం చేసుకోవడం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టం కలిగించిందని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి ఉనికి లేకుండా పోయిందని జీవన్ రెడ్డి అన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: