తెలంగాణ వార్తలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (Maganti Gopinath) కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడిన గోపీనాథ్‌ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్‌, కుమార్తె అక్షరనాగ ఉన్నారు.

గోపీనాథ్‌ అంత్యక్రియలను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జరుగనున్నారు. గోపీనాథ్‌ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా దవాఖానలో ఆయన చికిత్సకు అయిన ఖర్చును చెల్లించనున్నట్లు వెల్లడించింది. గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన బౌతికకాయాన్ని మాదాపూర్‌లోని నివాసానికి తరలించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్‌, వివేకానంద్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్‌, పార్టీ నేతలు వినోద్‌ కుమార్‌, మాలోత్‌ కవిత, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గోపీనాథ్‌ను చివరిసారిగా చూసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. గోపీనాథ్‌ భూతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, టి. హరీశ్ రావు, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని కేసీఆర్ అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారన్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మరోవైపు కేటీఆర్, టి. హరీశ్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కాగా, గోపీనాథ్ మృతి నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు నల్లగొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు. 

ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు, పువ్వాడ, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే సండ్ర తదితర ప్రముఖులతో దివంగత ఎమ్మెల్యే మాగంటి అంతిమయాత్రలో పాల్గొని అంత్యక్రియలకు హాజరు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితర ప్రముఖులతో కలిసి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్రలో పాల్గొని అంత్యక్రియలకు హాజరయ్యారు.మాదాపూర్ డాక్టర్స్ కాలనీలోని గోపీనాథ్ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్,ఫిల్మ్ నగర్ మీదుగా మహా ప్రస్థానం చేరుకుంది.ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులతో కలిసి గోపీనాథ్ పార్థివదేహాన్ని ఉంచిన పాడేను కొంత దూరం మోసి ఘనంగా నివాళులర్పించారు.స్వర్గీయ గోపీనాథ్ అంతిమయాత్రలో ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మల్లారెడ్డి, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, మాణిక్ రావులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా: భట్టివిక్రమార్క

Ram Narayana

గాంధీ హాస్పటల్ వద్ద ఉద్రిక్తత బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్?

Ram Narayana

కొడుకు పుట్టలేదని ఘోరం.. 9 నెలల కూతురు సహా తల్లి ఆత్మహత్య!

Ram Narayana