తెలంగాణ వార్తలు

మాగంటి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పూలగుచ్చం సమర్పించి మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు కేసీఆర్‌. మాగంటి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అంతేకాదు వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇక ఇలా ఉండగా ఉదయమే మాగంటి మృతి విషయం తెలిసిన వెంటనే కూడా సౌమ్యుడు.. ప్రజా నేత కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ అధినేత మాగంటి మృతదేహాన్ని సందర్శించి భావోద్వేగానికి గురయ్యారు. ఇక మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కూడా మాగంటి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహాప్రస్థానంలో ఇవ్వాల సాయంత్రం 3 గంటల నుంచి అంత్యక్రియల ర్యాలీ కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.  మాగంటి కుటుంబ ఆలోచన మేరకు మాత్రమే ఇలా చేస్తున్నామన్నారు. ఇది ఇలా ఉండగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం… వీరికి వర్తించదు!

Ram Narayana

గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఉద్రిక్తత.. రోగి మృతితో బంధువుల ఆందోళన!

Ram Narayana

అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది … శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana