తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆశించి భంగపడ్డవారికి బుజ్జగింపులు

ఎట్టకేలకు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది …అయితే ఇది పాక్షిక విస్తరణ కావడంతో వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్న, పదవులు ఆశించి రానివాళ్లు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారు …తాము అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకుంటామని అంటున్నారు …మరో మూడు బెర్తులు ఖాళీగా ఉండటంతో భంగపడ్డవారిని బుజ్జగించే పనిలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి పొన్నం ప్రభాకర్,వేం నరేందర్‌రెడ్డి ఇతర నేతలు రంగంలోకి దిగారు …మొదట మీనాక్షి నటరాజన్ సీనియర్ నేత నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది …ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేసింది ..కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ,మాల్ రెడ్డి రంగారెడ్డి , ప్రేమ్ సాగర్ రావు లను కలిశారు …మాల్ రెడ్డి రంగారెడ్డి మాత్రం తాను రాహుల్ గాంధీ వద్దనే తేల్చుకుంటామని చెప్పారు …ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది …

మంత్రి పదవులు పొందినవారిలో వివేక్ ,లక్ష్మణ్ , శ్రీహరిలు …

ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి
మంత్రి వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

తెలంగాణ కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, పాలమూరు ఉమ్మడి జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి‌లకు రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ, శాసనమండలి స్పీకర్లు గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త మంత్రులకు ఈరోజు సాయంత్రం శాఖల కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయి.

నూతన మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు

ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరిలకి అభినందనలు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రనాయక్‌కు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అదేవిధంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్‌

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రామచంద్రనాయక్ తెలిపారు. డోర్నకల్ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సహచర ఎమ్మెల్యేలకు రామచంద్రనాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని రామచంద్రనాయక్ పేర్కొన్నారు.

Related posts

జానారెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. గంటసేపు చర్చించుకున్న నేతలు

Ram Narayana

 ఫిరాయింపులపై చర్చల నడుమ దానం నాగేందర్ కీలక ప్రకటన..

Ram Narayana

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి ,అద్దంకి , శంకర్ నాయక్

Ram Narayana