రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్‌పాస్ ఛార్జీలు పెరిగాయి. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ పాస్ ధరలను పెంచింది టీజీఎస్ ఆర్టీసీ. పెంచిన బస్ పాస్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లు పెరిగాయి. రూ. 1150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర రూ. 1400కు పెంపు, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ రూ. 1800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను పెంచారు. సాధారణ ఛార్జీలతో పాటు బస్ పాస్ ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పురుష ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించి, మగాళ్లపై ఛార్జీల బాదుడు ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్‌కు నూకలు చెల్లినట్లే అని ప్రయాణికులు మండిపడుతున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: