హైకోర్టు వార్తలు

హైకోర్టులో హరీశ్‌రావుకు ఊరట .. ఎన్నికల పిటిషన్‌ కొట్టివేత

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో హరీశ్‌రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్‌ గౌడ్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ నుంచి హరికృష్ణ, బీఎస్పీ నుంచి చక్రధర్‌ గౌడ్‌ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన హరీశ్‌రావు అఫిడవిట్‌లో పూర్తి సమాచారం వెల్లడించకుండా రహస్యంగా ఉంచారని చక్రధర్‌ గౌడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడి వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. దాన్ని కొట్టివేసింది.

ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలని సూచించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీ నయవంచనను ఎండగట్టి తీరుతామని హెచ్చరించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Related posts

అరుదైన ఘట్టానికి వేదికైన తెలంగాణ హైకోర్టు

Ram Narayana

అలా అయితే భారత్ నుంచి నిష్క్రమిస్తాం.. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టీకరణ…

Ram Narayana

మిత్రుడి ఇంటికి వెళ్లడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా …?రాదా …?

Ram Narayana